రాయదుర్గం పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రూప అనే నవ వదువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంబేద్కర్ నగర్ కే చెందిన అనిన్ అనే యువకుడితో రూప కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం రోజున ఆ యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బళ్లారి విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.