గూడూరు లో దసరా సెలవుల్లో స్నేహితులతో కలిసి సరదాగా స్నానానికి వెళ్లి జొన్నలరేవు రామరాజుపాలెం ఛానల్లో మునిగిపోయిన బాలుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. గూడూరు నగరం పేటకు చెందిన ఏడీ తరగతి విద్యార్థి జీవన్ కుమార్, స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్ళగా, ఉధృతంగా ప్రవహించిన నీటిలో కొట్టుకుపోయాడు. చివరకు రామరాజుపాలెం అడ్డ రోడ్డు వంతెన క్రింద అతని మృతదేహం దొరికింది.