ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన దుర్గం అశోక్ (40) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండగా, కుటుంబ సభ్యులు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నేడు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మృతుకి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.