పల్నాడు జిల్లా,ముప్పాళ్ల మండలం,ఇరుకుపాలెంలోని హెచ్పీ గ్యాస్ గోదాం సమీపంలో మంగళవారం బైక్ ప్రమాదం జరిగింది. అబ్బూరుకు చెందిన మల్లికార్జున (40) తన బైకు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. 108కి కాల్ చేసినా సకాలంలో రాకపోవడంతో, తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ మల్లికార్జున తన బైక్పైనే ఆసుపత్రికి వెళ్లారని స్థానికులు వివరించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.