వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో బ్రహ్మాండంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని వినాయక సాగర్ లో నిమర్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలో వినాయక చవితి నిర్వహణ నిమజ్జన ఏర్పాట్లపై గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులతో కమిషనర్ సమావేశమై సమీక్షించారు వినాయక చవితి నిమజ్జనంలో ఆయా విభాగాల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.