శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకులు ధర్నా శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకులు యూరియా కొరతపై నిరసన తెలిపారు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం కార్యాలయంలోని ఇన్ఛార్జ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులను దగా చేసిందన్నారు. యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారన్నారు.