ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వినాయక నిమజ్జనాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని బుధవారం మధ్యాహ్నం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని 45 ఏళ్లుగా ఇక్కడే నిమజ్జనాలు జరుగుతున్నాయని వెంటనే ఏర్పాటు చేయాలని లేకుంటే మండపాల నుంచి వినాయకులను తరలించి భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు ఆందోళన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.