భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్ళపల్లి మండలం వేములపల్లి గ్రామ రైతులు బుధవారం ఉదయం 8 గంటలకు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని రోడ్లు మొత్తం బురదయమంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,ఈ నేపథ్యంలో హనుమకొండ నుంచి బంగ్లాపల్లి, వేములపల్లి కి వచ్చే ఆర్టీసీ బస్సు కూడా రాకుండా రోడ్డు బుడదమయంగా మారిందని దీంతో ఆసుపత్రికి,ఆఫీసులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు వేములపల్లి గ్రామ రైతులు.