ఆళ్లగడ్డలో రేషన్ డీలర్లతో తహశీల్దార్ సమీక్ష,ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సకాలంలో సరకులు అందజేయాలని ఆమె ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు సమావేశంలో పాల్గొన్నారు.