అనంతపురం నగర శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈనెల 21వ తేదీన ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఐజి కాలనీకి చెందిన పాండు అనే వ్యక్తి గాయపడ్డాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.