పడుగుపాడుకు చెందిన బిల్డర్ ని బెదిరించిన కేసులో ఇప్పటికే లేడీ డాన్ అరుణతో పాటు మరో ముగ్గురిని కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం అప్సర్, ముసవీర్, గణేశులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తంగా ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోపక్క అరుణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను అరుణ మోసం చేసిందంటూ పోలీసులు ఎదుట వాపోతున్నారు. మరికొన్ని కేసులు అరుణపై నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.