రేషన్ షాప్ డీలర్ల కమీషన్ వెంటనే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ గత ఐదు నెలల కమిషన్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు ఇస్తామన్న రూ. 5 వేల గౌరవ వేతనం, క్వింటాలకు 300 రూపాయలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.