ఆనందపురం మండలం బోయపాలెం బ్రిడ్జిపై శనివారం సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది సమాచారం ప్రకారం ఒక మహిళ హెల్మెట్ పెట్టుకోకుండా అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుతూ సిగ్నల్‌ను క్రాస్ చేయడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పై బలంగా పడిపోయింది ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది అప్పటికే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కే.మనోహర్ ప్రసాద్ పరిస్థితిని గమనించి వెంటనే స్పందింఛి అంబులెన్స్ ని రప్పించి ఆసుపత్రికి తరలించారు కాగా ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.