మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి పదివేల రూపాయల చొప్పున రెండు లక్షల 90 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో జడ్జ్ ఉమాదేవి తీర్పు వెలువరించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పి సాయినాథ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ లక్ష్మీనారాయణ వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 29 మంది పట్టుబడ్డారు రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లాలోని ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలు తప్పక పాటించాలని లేదా భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ట్రాఫిక్ సిఐ లక్ష్మీనారాయణ హెచ్చరించారు