వైసీపీ పాలనలో రైతులను నరకం అనుభవించేలా చేశారని, యూరియా కోసం రైతులు రాత్రిళ్లు క్యూలలో నిలబడ్డారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభాప్రాంగణం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఉచిత పంటల భీమా పేరుతో రైతులను మోసం చేశాడని, ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించినా ఒక్క కేజీ కూడా కొనలేని చేతకాని వాడు జగన్ అని మండిపడ్డారు. వ్యవసాయ , పశు సంవర్ధక , మత్స్యరంగాలను సర్వనాశనం చేశారన్నారు.