అనంతపురం నగర శివారులోని స్టాలిన్ నగర్ వద్ద ఉన్న కాలువలో నగర పరిధిలోని తపోవనంకు చెందిన కొత్త శివ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో ఘర్షణ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను మంగళవారం ఉదయం నగర శివారులోని స్టాలిన్ నగర్ కాలువలో మృతదేహం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.