గంట్యాడ మండలం నరవ గ్రామం లో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన సుంకరి నారాయణరావును మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి బలం గా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సుంకరి నారాయణరావు నరవ లో ఆటో దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో గంట్యాడ నుంచి విజయనగరం వైపు మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో కాలు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని గంట్యాడ 108 వాహనం లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.