సీఎం చంద్రబాబు 50 ఏళ్ల సుదీర్ఘ ప్రజాజీవితం ఆదర్శమని, నీతినిజాయతీలకు నిలువుటద్దం, ఆయనకు సాటి లేరు, వేరెవరూ రాలేరని అన్నారు చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు. తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకుని 30 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని తరచి చూస్తే సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారని కొనియాడారు.త్వరలోనే సుమారు 10 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వినుకొండ ఒకటో వార్డు సిద్ధార్థ నగర్‌లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.