భీమవరం 29వ వార్డు ప్రకాశ్‌నగర్‌లో డ్రైనేజీ, మంచినీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మైదాన గిరిజనులు శుక్రవారం మధ్యాహ్నం 12:30 కు ధర్నా నిర్వహించారు. సిపిఎం టౌన్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. వర్షాకాలంలో నీరు రోడ్లపై నిల్వ ఉండి దోమలతో మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకొని గెలిచిన తరువాత అధికారులకు మైదాన గిరిజనుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.