తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశామని ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి కృష్ణ నీళ్లు తీసుకువచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్లయినా నీళ్ల కరువు లేకుండా చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా నీళ్లు ఇచ్చేటట్లు చేస్తామని ఆయన తెలిపారు.