కుప్పంకు కృష్ణ జలాలను తీసుకొచ్చిన ఈ రోజు తన జీవితంలో ఎంతో పవిత్రమైన రోజని CM చంద్రబాబు పేర్కొన్నారు. 'ఎనిమిది ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డగా గెలిపించారు. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నిత్యం కృషి చేస్తా. దాదాపు 730 కి.మీ నుంచి కృష్ణా జలాలలను కుప్పంకు తెచ్చాం. దీని కోసం 27 లిఫ్ట్ ఇరిగేషన్లు, ఎన్నో సొరంగాలను తవ్వాం. దీంతో కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చినట్లు ఉంది' అని సీఎం అన్నారు.