ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట రైతు సేవా కేంద్రం నందు మండల వ్యవసాయ అధికారిని బుజ్జి భాయి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట వేసినా ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. పంట నమోదు వలన ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందుటకు గిట్టుబాటు ధరకు పంట దిగుబడులను అమ్ముకొనుటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం లబ్ధి పొందుటకు ఉపయోగపడుతుందని తెలిపారు. పత్తి పంటలో వచ్చే వివిధ రకాల సూక్ష్మ పోషక లోపాల గురించి వివరించినట్లు తెలిపారు.