సూరారం విశ్వకర్మ కాలనీలో గైనకాలజీ, చిన్నపిల్లల వైద్య నిపుణుల బృందం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు ప్రజలకు సూచించారు. కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాగరాజు గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.