అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు గర్భిణీలకు పౌష్టిక ఆహారం కోసం అందజేస్తున్న భోజనం కోడిగుడ్లు తాజాగా ఉండాలని,చిన్నారులు పౌష్టిక ఆహారాన్ని ఇష్టంగా తినాలని,అంగన్వాడీ కేంద్రంపై పిల్లల్లో ఇష్టత పెంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.మంగళవారం కలెక్టర్ దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో విస్తృతంగా పర్యటించి జిల్లా పరిషత్ హై స్కూల్, అదే కాంపౌండ్ లో ఉన్న ప్రైమరీ స్కూల్ ,అంగన్వాడి కేంద్రం ల నిర్వహణ తీరు ను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడి కేంద్రంలోని చిన్నారుల ను పలకరించారు.పౌష్టికాహారం కొరకు నిలువ చేసిన వస్తువులను పరిశీలించారు.