తెలంగాణలో పోరాట అగ్గి రగిల్చిన వారిలో సుప్రసిద్ద కమ్యూనిసు రావి నారాయణరెడ్డి ఒకరని ఆయన పోరాట నిప్పు కణిక అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. నిజాం నిరంకుశ నియంతృత్వ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి బానిసలుగా బతుకుతున్న ప్రజలను చైతన్యపరిచిన ఘనుడు రావి నారాయణ రెడ్డి అన్నారు. రావి నారాయణరెడ్డి 34వ -వర్ధంతి సందర్భంగా స్థానిక గిరిప్రసాద్ భవన్ లో రావి నారాయణరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి సిపిఐ నాయకులు -నివాళులర్పించారు.