కడప జిల్లా కమలాపురం మండలం పాచికపాడు గ్రామంలో బుధవారం కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్య రెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన పాచిక పాడు గ్రామం లోని టిడిపి కార్యకర్త గంగిరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామ నాయకులు, ప్రజలతో మాట్లాడి సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.