రామాయంపేట మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే రోహిత్ రావు చిత్రపటానికి చిరు వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, రైతులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ వసూలు నిలిపివేస్తూ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాప్ యాదగిరి.