హుజురాబాద్ : మండలం చెల్పూర్ గ్రామంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద వేకువజాము నుండే యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు యూరియా వస్తుందన్న సమాచారం తో ఉదయం నుండి రైతులు వేరువేరుగా చెప్పులు క్యూ లైన్ లో పెట్టీ వేచి చూస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టీ యూరియా బస్తాలు దొరకక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డదని యూరియా కోసం సొసైటీల వద్ద మంగళవారం ఉదయం నుండి సాయంత్రం పడిగాపులు గాసిన ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడే యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.