కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని పూసలవాడ మరియు దూదేకుల వీధి సచివాలయాలను బుధవారం మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి ఆకస్మిక తనఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన తనఖీలో భాగంగా పలు రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మౌళిక సదుపాయాలకు సంబంధించి సచివాలయంలో తప్పనిసరిగా కంప్లైంట్ రిజిస్టర్ పెట్టాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి సచివాలయ సిబ్బంది పనితీరు మరియు మౌళిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.