రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రాచకొండ సిపి సుధీర్ బాబు గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసుల కృషి వల్ల ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. స్టేట్ కమిటీ మెంబర్ తో పాటు ఏరియా కమిటీ మెంబర్ లొంగిపోయారని ఆయన తెలిపారు. వారిలో కాకరాల సునీత అలియాస్ బద్రి స్టేట్ కమిటీ మెంబర్గా, హరీష్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నారని ఆయన అన్నారు. కాకరాల సునీత పార్టీ సిద్ధాంతకర్తగా పార్టీ బ్యాక్ బోన్ గా పని చేశారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు.