గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు సిటీలోకి ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్విన్ సిగ్నల్ వద్ద ప్రైవేట్ బస్సులను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.