విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడాలని పీసీసీ సభ్యుడు మువ్వల శ్రీనివాసరావు కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. విశాఖలో ఈ రోజు జరగబోయే సేనతో సేనాని సభలో పవన్ స్పందించాలన్నారు.