Parvathipuram, Parvathipuram Manyam | Aug 21, 2025
ప్రజాభిప్రాయం తర్వాతే బడిదేవరకొండ క్వారీ నిర్వహణ చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. గురువారం ఎమ్మెల్యే పార్వతీపురం మండలంలోని బడిదేవరకొండ క్వారిని పరిశీలించారు. కొండ బాధిత గ్రామాల ప్రజల ఫిర్యాదు మేరకు పరిశీలించడం జరిగిందన్నారు. తక్షణమే మరో మారు ప్రజల సేకరణ తర్వాత పనులు నిర్వహించాలన్నారు. చెరువు కలుషితం కావడం, శబ్దాలు రావడం తదితర సమస్యల పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.