నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణి లో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దుచేసి రైతు సంఘాలు రెవెన్యూ అధికారులు మేధావులతో చర్చలు జరిపి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.