తాడిపత్రి మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ తాడిపత్రి పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ అన్నారు. తాడిపత్రిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజ్ నీరంతా రోడ్లపై చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ మెరుగుపరచడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోరాట కాలనీలో డ్రైనేజీ మరింత అధ్వానంగా ఉందన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు.