రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు వద్ద వాగులో పడి మహిళ మృతి. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన గైని సరవ్య 78 సంవత్సరాలు మంగళవారం ఉదయం వాగులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు . అటుగా వెళ్లిన కాలనీవాసులు మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో గుర్తించి సమాచారం అందించగా పంచనామా నిర్వహించి శివాని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.