వికారాబాద్ జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి గురువారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ శాంతి సౌభాగ్యం ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని మనస్పూర్తి ఆకాంక్షను తెలిపినట్లు తెలిపారు. పోలీస్ శాఖ నిరంతరం ప్రజల సేవకు సిద్ధంగా ఉంటుందని అలాగే ప్రజలందరూ వినాయక నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.