ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు దళితుడి ఇంటిని అక్రమంగా కూలగొట్టించడంతో శుక్రవారం సాయంత్రం 4:30 cpiml మాస్ లైన్ ప్రజాపoత నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవారం మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా ఇంద్రపు గోపి ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడని అట్టి ఇంటిని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఇంటిని కూలగొట్టించాడని తెలిపారు. శ్రీనివాస్ ఇంటిని దొంగ చాటున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఖండించారు. అధికారులు స్పందించి పేద దళితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.