ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టులోకి 3,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వట్టివాగు ప్రాజెక్ట్ అధికారులు మంగళవారం ఉదయం,2 గేట్లను ఎత్తి 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 2.890 టీఎంసీ కాగా ప్రస్తుతం 2.519 టీఎంసీల చేరింది. ప్రాజెక్ట్ దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.