వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ శివాలయం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పట్టణంలోని రైల్వే స్టేషన్ మల్లికార్జున దేవాలయంలో శని వారం అమావాస్య, శ్రావణ చివరి శనివారం సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.