ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు రాసేందుకు యువత భారీగా తరలివచ్చారు. ఇవాళ ఒంగోలు జరుగుతున్న ఈ పరీక్షకు అభ్యర్థులు తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో బస్టాండుకు చేరుకున్నారు. దీంతో బస్టాండ్ ప్రాంగణం అభ్యర్థులతో కిటకిటలాడింది. అయితే సకాలంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధిక చార్జీలతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.