అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఉప్ప గ్రామాన్ని మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా పాడేరు ఐటీడీఎ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉప గ్రామానికి చెందిన సుమారు 200 మంది గిరిజనులు పాడేరు ఐపిఎస్ చేరుకుని ఐటీడీస్ లో వినతి పత్రానంద చేశారు మాజీ ఎమ్మెల్యే పాల్గొన్న ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన ఉపాధి మండల కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.