బుచ్చికి ఫైర్ స్టేషన్ మంజూరు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషితోనే ఫైర్ స్టేషన్ మంజూరైందని బుచ్చి నగర పంచాయతీ ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ తెలిపారు. పట్టణంలోని మలిదేవి కాలువ వద్ద ఉన్న పాత డంపింగ్ యార్డ్ వద్ద ఫైర్ స్టేషన్కు కేటాయించిన ప్రదేశాన్ని అగ్నిమాపక అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు పనులను ఆమె పర్యవేక్షించారు