సేవాకార్యక్రమాలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో సేవాభావం పెంపొదించవచ్చని భీమడోలు మానసా స్కూల్ కరస్పాండెంట్ యలమర్తి రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం మథర్ థెరిస్సా జయంతి సందర్బంగా భీమడోలు మానసా ఇంగ్లీష్ మీడియం స్కూలు టెన్త్ విద్యార్థులు తమ సొంతనిధులతో గ్రామంలోని పేదలకు, వృద్దులకు నిత్యావసరాలు, దుప్పట్లు, వస్త్రాలు, భోజనం, మందులను అందజేశారు. ఈసందర్బంగా కరస్పాండెంట్ యలమర్తి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఆగష్టు 26 మథర్ థెరిస్సా జయంతి పురస్కరించుకుని గత 15సంవత్సరాలుగా తమ పాఠశాలలోని టెన్త్ విద్యార్థులు పేదలకు వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.