జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ తన పర్యటనలో భాగంగా మంగళవారం రాజవొమ్మంగి మండంలోని లాగరాయి పిహెచ్సి పరిధిలో లాగరాయి, లుబ్బర్తి , కీండ్రా గ్రామాలలో పర్యటించి జ్వరాలు, కీళ్లనొప్పులు వ్యాధుల పై సంబంధిత వైద్యులతో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. విశ్వేశ్వర నాయుడు, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్యల్, పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది ఉన్నారు