బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని శ్రీకాకుళం జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కే హరిబాబు అన్నారు. స్థానిక మండలం పొన్నాడ గ్రామంలో బాలలు గ్రామస్తులతో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యంలో వివాహాలు చేయడంతో వారి బ్రతుకులు చిన్నాభిన్నం అవుతాయని తెలియజేశారు. బాల్య వివాహాలకు ప్రోత్సహించే వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఎస్సై సందీప్ కుమార్, ఎంపీడీవో,ఎమ్మార్వో ఉన్నారు.