మైదుకూరు సీఐ రమణారెడ్డి విద్యార్థులను చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, సోషల్ మీడియా వినియోగం, ఇంటర్నెట్ సేవల ప్రయోజనాలు–లోపాలు గురించి వివరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు, సెల్‌ఫోన్‌కి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.