బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత అంగడి బజార్ ,ఇస్లాంపూర కాలనీ, గౌలిగూడ, కమ్మరిపల్లి, పాత బాన్సువాడలో చెడిపోయిన రోడ్లకు మరమ్మతులు చేయాలని కాలనీవాసులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ కు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వినతి పత్రాలను అందజేశారు. వర్షాలు పడితే రోడ్లు చెడిపోయి నడవలేని పరిస్థితి నెలకొందని వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.