మెదక్ జిల్లా శంకరంపేట-ఎ మండలం ముసాపేట గ్రామానికి చెందిన బైకాని గంగమేశ్వర్ (18) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు మూడు నెలల క్రితం భార్య మానస ఉరివేసుకుని మృతిచెందగా, ఆ కేసులో గంగమేశ్వర్ జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. నిన్న సాయంత్రం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శుక్రవారం ఉదయం గోండ్ల రాములు బావి వద్ద ఆయన బట్టలు, ఫోన్ దొరకగా, బావిలో మృతదేహం లభ్యమైంది. జైలు అనుభవం, కేసు భయంతోనే ఆయన నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.