కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సమీపంలోని మాయాపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా శనివారం ఉదయం 11 గంటలకు పర్యటించారు. సముద్రపు కోతకు గురైన రోడ్లు, ఇళ్లు, పాఠశాలను ఆమె పరిశీలించారు. తమ ఇబ్బందులను ప్రజలు ఆమెకు వివరించగా, కోతకు గురైన ఇళ్లలో నివసిస్తున్న వారికి రేషన్ పంపిణీకి ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ధైర్యం చెప్పి, సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.